Ravi Teja Surgery: సర్జరీ సక్సెస్..ట్వీట్ చేసిన రవితేజ
భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ గాయపడటంతో సర్జరీ జరిగింది. తాజాగా ఈ ఆపరేషన్‌పై రవితేజ ట్వీట్ చేశారు. శాస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని, డిశ్చార్జ్ కూడా అయ్యాయని, మళ్లీ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ తెలిపారు. అభిమానుల ఆశీర్వాదం, మద్దతు వల్ల మళ్లీ ఎగ్జెటింగ్ ఉన్నానని ఆయన వెల్లడించారు.
రవితేజ కుడిచేతికి గాయం
RT 75 సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ కుడి చేతికి గాయమైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మాస్ మహారాజ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. RT 75 సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్, కామెడీ చిత్రంగా భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'మిస్టర్ బచ్చర్' ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. రన్ టైమ్ ట్రిమ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం RT75 సినిమాపై ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.