Loading...
Surya 47: దీపావళికి 'సూర్య 47' ధమాకా.. రిలీజ్ ఎప్పుడంటే!
దీపావళికి 'సూర్య 47' ధమాకా.. రిలీజ్ ఎప్పుడంటే!

Surya 47: దీపావళికి 'సూర్య 47' ధమాకా.. రిలీజ్ ఎప్పుడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల 'కరుప్పు' సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై వేగం పెంచారు. ఇప్పటికే 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా 'సూర్య 47' సినిమా విడుదల తేదీ కూడా ఖరారైనట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో రూపొందిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా సూర్య - నజ్రియా జంటగా తెరకెక్కుతున్న 'సూర్య 47' చిత్రాన్ని కూడా ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

వివరాలు

దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్

'ఆవేశం' ఫేమ్‌ జీతూ మాధవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

దీపావళి విడుదల ఖరారైతే.. 2026లో సూర్య ఖాతాలో మూడు సినిమాలు చేరనున్నాయి. దీంతో ఈ ఏడాది ఆయన అభిమానులకు వరుసగా సినిమాలతో పూర్తి వినోదాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో యువ నటుడు నస్లేన్ కీలక పాత్రలో నటిస్తుండగా, సూర్య-నజ్రియా కాంబినేషన్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో కొనసాగుతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీపై త్వరలోనే చిత్రబృందం ప్రకటన చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT