Loading...
Suriya: రాజమౌళికే కౌంటర్‌ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!
రాజమౌళికే కౌంటర్‌ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!

Suriya: రాజమౌళికే కౌంటర్‌ ఇచ్చిన సూర్య.. స్టేజ్‌పై నవ్వులే నవ్వులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఒకే వేదికపై కనిపిస్తే సందడి మామూలుగా ఉండదు. తాజాగా జరిగిన 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమా వేడుకలో సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్య.. రాజమౌళిని ఉద్దేశించి సరదాగా, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'రాజమౌళి గారూ.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.

వివరాలు

ఇండస్ట్రీలోకి 29ఏళ్లు పూర్తియ్యాయి

అయితే ఒక విషయం.. మిమ్మల్ని 'సర్‌' అని గౌరవంగా పిలుస్తున్నాను కానీ, ఇండస్ట్రీ అనుభవంలో మీకంటే నేనే సీనియర్‌! నాకు సినీ పరిశ్రమలో దాదాపు 28 నుంచి 29 ఏళ్లు పూర్తయ్యాయంటూ సూర్య సరదాగా పంచ్‌ విసిరారు.

ఆయన వ్యాఖ్యలతో సభా ప్రాంగణం నవ్వులతో మారుమోగగా.. రాజమౌళి కూడా నవ్వుకున్నారు. అంతటితో ఆగకుండా సూర్య మరో ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు.

'కల్కి సినిమాలో మీరు రెండు నిమిషాల క్యామియో చేసినట్లు.. ఏదో ఒక రోజు మీ సినిమాలో నాకు కూడా ఓ చిన్న అతిథి పాత్ర ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానంటూ చమత్కరించారు. ఆ తర్వాత రాజమౌళి విజన్‌ను సూర్య ఎంతో భావోద్వేగంగా ప్రశంసించారు.

వివరాలు

సోషల్ మీడియాలో వైరల్

భారతీయ సినిమాను ప్రాంతీయ హద్దులు దాటించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో రాజమౌళి కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ఒక ఈగతో సినిమా చేసినా.. అగ్ర హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించినా.. ప్రేక్షకుడు థియేటర్‌లో రెండున్నర గంటల పాటు కళ్లప్పగించి చూసేలా కథను రూపొందించడం రాజమౌళి ప్రత్యేకత అని పేర్కొన్నారు.

అలాగే కొత్త తరాన్ని, వినూత్న ఆలోచనలు, ప్రయోగాత్మక ప్రయత్నాలను ప్రోత్సహించడంలోనూ రాజమౌళి ఎప్పుడూ ముందుంటారని సూర్య ప్రశంసించారు.

సరదా కౌంటర్లతో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రశంసలతో సాగిన సూర్య ప్రసంగం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ADVERTISEMENT