Suriya: కోలీవుడ్ హీరో సూర్య క్రేజీ ఆఫర్.. విలన్‌గా మారిన హీరో ..?
బాలీవుడ్‌లో రూపొందిన హెయిస్ట్ యాక్షన్ చిత్రాలలో 'ధూమ్' (Dhoom) ప్రత్యేక ఆదరణ పొందింది. 2004లో విడుదలైన ఈ చిత్రం పలు సీక్వెల్స్‌ను పొందింది, వీటన్నింటికీ బాక్సాఫీస్‌లో సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంఛైజీలో త్వరలో 'ధూమ్ 4' రూపొందనుంది. చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈ సినిమాకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 'ధూమ్', 'ధూమ్ 2', 'ధూమ్ 3' చిత్రాలకు కథ అందించిన ఆదిత్య చోప్రా, 'ధూమ్ 4' కోసం కూడా పని చేస్తున్నారని, ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని సిద్ధం చేయడానికి నిర్మాతలు కృషి చేస్తున్నారని తెలిసింది.
సినీ అభిమానులు ఆనందం
ఇప్పటికే, ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సూర్య (Suriya) కీలక పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. సూర్య ప్రధాన పాత్రధారి కావాలని చిత్రబృందం ఆయన్ని సంప్రదించిందని, ఆయన ఈ పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ వార్తపై సినీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సూర్య నటిస్తే ఈ చిత్రం మరో స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. కానీ, కొంతమంది అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
'విక్రమ్'చిత్రంలో రోలెక్స్ పాత్ర
సూర్యకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడం కొత్త ఏమీ కాదు.'24','విక్రమ్' వంటి చిత్రాల్లో అతను ఇలాంటి పాత్రలే పోషించాడు. 2022లో విడుదలైన 'విక్రమ్'చిత్రంలో రోలెక్స్ పాత్రతో అందరిని ఆశ్చర్యపరిచాడు. మాదక ద్రవ్యాల ముఠాకు నాయకుడిగా తన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. రోలెక్స్ పాత్రకు కేవలం కొన్ని నిమిషాల సమయం అయినప్పటికీ, అది సినిమాకు హైలైట్‌గా మారింది.