Dileep Shankar :హోటల్ గదిలో నటుడు అనుమానాస్పద మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆయన శవమై కనిపించారు.
దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. రెండు రోజుల క్రితం హోటల్‌లో గది బుక్ చేసుకున్న దిలీప్ శంకర్, అప్పటి నుంచి గది బయటకు రాలేదని సమాచారం.
ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచి చూడగా ఆయన శవమై కనిపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఫోరెన్సిక్ బృందం గదిని తనిఖీ చేస్తున్నట్లు కన్వెన్షన్ ఎస్పీ తెలిపారు.
Details
సంతాపం వ్యక్తం చేసిన సహనటి సీమా జి నాయర్
దిలీప్ శంకర్ మలయాళ సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించి ప్రాచుర్యం పొందారు.
ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆయన, చివరిసారిగా 'పంచాగ్ని' సీరియల్‌లో చంద్రసేనన్ పాత్రలో కనిపించారు.
అదేవిధంగా, 'అమ్మయ్యరియతే'లో పీటర్ పాత్రకు మంచి ప్రశంసలు అందుకున్నారు. దిలీప్ శంకర్ అకాల మరణం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆయన సహనటి సీమా జి నాయర్ తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు