Page Loader
టక్కర్ ట్విట్టర్ రివ్యూ: ఈసారైనా సిద్ధార్థ్ హిట్టు కొట్టాడా? 
టక్కర్ ట్విట్టర్ రివ్యూ

టక్కర్ ట్విట్టర్ రివ్యూ: ఈసారైనా సిద్ధార్థ్ హిట్టు కొట్టాడా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 09, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన టక్కర్ సినిమా ఈరోజు విడుదలైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైన ఈ మూవీపై ట్విట్టర్ లో రివ్యూలు రాస్తున్నారు. ప్రత్యేక షోస్, ప్రీమియర్ షోస్ చూసిన వారందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళేమంటున్నారో చూద్దాం. డబ్బు ఆశ ఉన్న అబ్బాయికి డబ్బువల్లే అన్ని బాధలు అనుకునే అమ్మాయి పరిచయం అవుతుందనీ, ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రయాణంలో ఎలా సాగిందన్నదే టక్కర్ కథ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫస్టాఫ్ బాగుందని అంటే ఇంకొందరు ఫస్టాఫ్ డల్ గా ఉందంటున్నారు. సెకాండాఫ్ లో యోగిబాబు సీన్లలో కామెడీ పండిందని అంటున్నారు. ఎప్పటిలానే సిద్ధార్థ్ బాగా చేసాడని చెబుతున్నారు.

Details

పక్కా కమర్షియల్ సినిమా 

పాటలు బాగున్నాయని, నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదని, అక్కడక్కడా మాత్రమే ఫర్వాలేదని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా అని తమ సోషల్ అకౌంట్స్ లో రాసుకొస్తున్నారు. విలన్ క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదనీ, లవ్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుందనీ, డీసెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టక్కర్ సినిమాను థియేటర్లో చూడాలని సలాహా ఇస్తున్నారు. సిద్ధార్థ్ పర్ఫామెన్స్, యోగిబాబు కామెడీ సీన్లు, పాటలు సినిమాలో హైలైట్ గా నిలిచాయని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పీపుల్ మీడీయా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు.

Embed

టక్కర్ ట్విట్టర్ రివ్యూ

Premier show

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టక్కర్ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టక్కర్ ట్విట్టర్ రివ్యూ