Page Loader
అతనితో నేను సంతోషంగా ఉంటాను: విజయ్ వర్మతో బంధంపై తమన్నా మాటలు 
విజయ్ వర్మతో బంధంపై తమన్నా మాటలు

అతనితో నేను సంతోషంగా ఉంటాను: విజయ్ వర్మతో బంధంపై తమన్నా మాటలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 13, 2023
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

గతకొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మలపై అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ వర్మ కలిసి కనిపించడం, హగ్ చేసుకున్న వీడియోలు బయటకు రావడం వల్ల వీరిద్దరి బంధం గురించి అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ నటించారు. టీజర్ లో కనిపించిన దాని ప్రకారం, ఈ సిరీస్ లో వీరిద్దరూ రొమాంటిక్ కపుల్ గా కనిపించారు. దాంతో వీరిద్దరి మధ్య నిజంగానే బంధం ఉందని జనాలు అనుకోవడం మొదలెట్టారు. తాజాగా తమ బంధంపై తమన్నా నోరు విప్పింది.

Details

అతను నా హ్యాపీ ప్లేస్ 

లస్ట్ సోరీస్ 2 లో విజయ్ వర్మతో కలిసి పని చేసాను, కలిసి చేసినంత మాత్రాన అవతలి వాళ్ళకు అట్రాక్ట్ అయిపోము. అవతలి వాళ్ళు మనకు ప్రత్యేకంగా అనిపించాలి. ప్రస్తుతం విజయ్ వర్మే నా హ్యాపీ ప్లేస్ అని తమన్నా సమాధానమిచ్చింది. తమ రిలేషన్ గురించి తమన్నా బయటపెట్టగానే, నెటిజన్లు అందరూ పెళ్ళెప్పుడంటూ ప్రశ్నలు వేస్తున్నారు. తమన్నా చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. అవన్నీ పూర్తయ్యాకే పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తమన్నా నటించిన జీ కర్దా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29నుండి లస్ట్ స్టోరీస్ 2 అందుబాటులో ఉంటుంది.