
Manchu Manoj : వీడియో చూస్తూనే కళ్లలో నీళ్లు.. స్టేజిపైనే భావోద్వేగానికి లోనైన మంచు మనోజ్
ఈ వార్తాకథనం ఏంటి
మంచు మనోజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈసారి అతడు ఎలాంటి కుటుంబ కలహాలతోనో, అన్నతో తలెత్తిన వివాదాల కారణంగానో కాదు.. పూర్తిగా అభిమానుల ప్రేమతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నటుడు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి అతడు నటించిన తాజా చిత్రం 'భైరవం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది.
ఈ వేడుకలో మనోజ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన వెంటనే మనోజ్ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నాడు.
కెమెరాల ముందే ఎమోషనల్ అయిన ఆయన.. 'ఈ రోజుల్లో నా ఇంట్లో వాళ్లే నన్ను ఇబ్బంది పెడుతున్నారు.
Details
ఎన్ని సమస్యలొచ్చినా పోరాడుతా
కానీ మీలాంటి అభిమానులు ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇదే నాకు పెద్ద ఆశీర్వాదం అంటూ గుండెల్లోని భావోద్వేగాలను వెల్లడించాడు.
అతడు మరోసారి ఇండస్ట్రీకి తిరిగి రావడం గురించి మాట్లాడుతూ ఏడేళ్ల గ్యాప్ తర్వాత సినీ రంగంలో అడుగుపెడుతున్నా. అయినా నా మీద మీ ప్రేమ తక్కువ కాలేదు.
నా తండ్రి మోహన్ బాబు గారు నేర్పిన క్రమశిక్షణే నాకు శక్తిని ఇస్తోంది.
ఈ శరీరం ఉన్నంతకాలం ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాను. ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడుతానని భావోద్వేగంతో మాట్లాడాడు.
మనోజ్ స్పీచ్‌లోని ఎమోషనల్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్ ద్వారా 'భైరవం'పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.