Teja Sajja Engagement: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో తేజ సజ్జా నిశ్చితార్థం.. డిసెంబరులో పెళ్లి
ఈ వార్తాకథనం ఏంటి
యువ నటుడు తేజ సజ్జా త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వివరాలు
ప్రముఖుల సందడి.. కాబోయే జంటకు ఆశీస్సులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని ఈ వేడుకలో పాల్గొన్నారు.
నటులు రవితేజ, రానా, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు, నిర్మాతలు విశ్వప్రసాద్, సాహూ గారపాటి కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
డిసెంబరులో ఉదయ్‌పుర్‌లో వివాహం
తేజ సజ్జా వివాహం డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
కాగా తమది పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ ఇటీవల వెల్లడించారు. వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, వారు టెక్నాలజీ వ్యాపారంలో ఉన్నారని ఆయన తెలిపారు.