mohan babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
సినీ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై దాడి కేసులో ఆయన వాదించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మోహన్‌బాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, గుండె, నరాల సంబంధిత సమస్యలు అతన్ని బాధిస్తున్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరిస్తూ, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్టు తెలిపాడు. ఇటీవల దుబాయ్‌లో తన మనవడిని కలిసేందుకు వెళ్ళిన మోహన్‌బాబు, తిరిగి తిరుపతికి చేరుకుని విద్యా సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నట్లు కూడా వెల్లడించాడు. దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని ఈ సందర్భంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అంగీకరించలేదు.