తెలుగు సినిమా: రీ రీలీజ్ లు నిర్మాతలకు లాభాలను ఇస్తున్నాయా? అసలు బిజినెస్ ఎలా జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో సూపర్ డూపర్ విజయాలు సాధించిన సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా మళ్లీ విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, జపాన్ లోనూ ఈ సినిమా కలెక్షన్లు బాగున్నాయి.
రీ రీలిజ్ ల పరంపర పోకిరి సినిమా నుండి మొదలైంది. పోకిరి మూవీని 4కే క్వాలిటీతో అమెరికాలో మళ్లీ రిలీజ్ చేస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా వచ్చాయి.
దాంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో పోకిరి మళ్లీ విడుదలైంది. పోకిరి తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా మళ్ళీ రిలీజైంది.
Details
రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది?
పదిహేనేళ్ళ క్రితం వచ్చిన సినిమాలను 4కే క్వాలిటీతో రిలీజ్ చేయడానికి 7నుండి 10లక్షల ఖర్చు అవుతుందట.
ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయినప్పటి కంటే ఇప్పుడు మళ్ళీ విడుదలైనప్పుడు కనిపించే పిక్చర్, చాలా క్వాలిటీగా ఉంటుంది.
జల్సా రీ రిలీజ్ కు 3.25కోట్లు వచ్చాయట. అలాగే పోకిరి సినిమాకు 1.75కోట్ల వసూళ్ళు వచ్చాయి. ఈ డబ్బులను ఛారిటీ కార్యక్రమాలను ఉపయోగించారు.
ఇక ఆరెంజ్ సినిమాకు వచ్చిన కోటి రూపాయల వసూళ్ళను జనసేన పార్టీకి అందించారు నిర్మాత నాగబాబు.
మొత్తానికి తెలిసొచ్చింది ఏంటంటే, రీ రిలీజ్ ల వల్ల సినిమా ఇండస్ట్రీకి లాభమే జరుగుతోంది. ఇటు అభిమానులకు కూడా తమ హీరోని మరోసారి తెరమీద చూసుకునే అవకాశమూ వస్తోంది.