
సీనియర్ సంగీత దర్శకుడు కోటికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో సంగీత దర్శకునిగా స్వరాలు సమకూరుస్తూ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నాడు కోటి.
1990ల ప్రాంతంలో రాజ్ తో కలిసి రాజ్ -కోటి అనే పేరుతో ఎన్నో తెలుగు సినిమాలకు పనిచేశారు. 1995 తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నటించిన సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు కోటి.
తాజాగా సంగీత దర్శకుడు కోటిని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో గౌరవంగా సత్కరించనున్నారు.
తెలుగు సినిమా సంగీతానికి కోటి చేసిన సేవలకు గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని న్యూ సౌత్ వెల్స్ పార్లమెంటులో అందించనున్నారు. ఈ మేరకు కోటికి ఆహ్వానం అందింది.
Details
మహిళా సాధికారతపై కోటి స్వరపరచిన పాట
ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ (ఏఐఎస్ఏసి) అందించనుంది. ఈ కార్యక్రమం మే నెల 26వ తేదీన జరగనుంది.
ఈ కార్యక్రమంలో కోటి స్వరపరచిన పాటను సింగర్ సుస్మిత రాజేష్ పాడనున్నారు. మహిళా సాధికారత మీద ఈ పాట ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతినిధి రాజేష్ ఉప్పల.. కోటి గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు 4 వేల పాటలకు సంగీతం అందించిన కోటిని.. గౌరవ సత్కారానికి ఆహ్వానించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు.
ఇలాంటి ప్రోగ్రామ్ ల వల్ల రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలంగా తయారవుతాయని రాజేష్ ఉప్పల మాట్లాడారు.