NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు 
    తదుపరి వార్తా కథనం
    జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు 
    క్రీడా నేపథ్యం నుండి వచ్చి సినిమా స్టార్లుగా మారిన వారు

    జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా మారిన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 11, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా క్రీడా నేపథ్యం నుండి వచ్చి వెండితెర మీద మెరిసిన వారు తక్కువ మంది ఉంటారు. ఆటలో సత్తా చాటుతూనే తెలుగు సినిమాలకు పరిచయమైన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    నాగశౌర్య:

    స్కూల్ రోజుల్లో టెన్నిస్ బాగా ఆడేవాడు నాగశౌర్య. జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాడు. హీరో అయ్యాక క్రీడా నేపథ్యమున్న సినిమాలో కనిపించాలని లక్ష్య మూవీలో విలువిద్యకారుడిగా కనిపించాడు.

    అవసరాల శ్రీనివాస్:

    రాకెట్ బాల్ అంటే ఎంతో ఇష్టపడే ఈ దర్శకుడు,నటుడు భారతదేశ రాకెట్ బాల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు. అమెరికాలో ఉన్నప్పుడు ఈ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. 2014లో ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు.

    Details

    బ్యాడ్మింటన్ లో స్టేట్ ఛాంపియన్ అయిన హీరో 

    సుధీర్ బాబు:

    సుధీర్ బాబుకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పదుకునే అకాడమీలో పుల్లెల గోపీచంద్ తో కలిసి శిక్షణ తీసుకున్నాడు. జూనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ (సమైక్య) స్టేట్ ఛాంపియన్ గా నిలిచాడు.

    రితికా సింగ్:

    నిజ జీవితంలో బాక్సర్ అయిన ఈ భామ, తన తొలి సినిమా గురు లో బాక్సర్ గా కనిపించింది. తమిళం, హిందీ, తెలుగులో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

    రకుల్ ప్రీత్ సింగ్:

    చిన్నప్పటి నుండి గోల్ఫ్ ఆడుతూ, జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంది. హీరోయిన్ గా మారిన తర్వాత వీలు చిక్కినప్పుడల్లా గోల్ఫ్ తప్పకుండా ఆడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలుగు సినిమా

    త్రిష బర్త్ డే: ఇరవై ఏళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ సినిమా
    అటు ఓజీలో పాట, ఇటు ఉస్తాద్ లో యాక్షన్: పవన్ కళ్యాణ్ డబల్ ధమాకా  పవన్ కళ్యాణ్
    చర్చల్లోకి సుడిగాలి సీక్వెల్: అల్లరి నరేష్ ను డైరెక్ట్ చేయబోతున్న ఎఫ్ 2 డైరెక్టర్?  సినిమా
    ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025