తెలుగు తెరకు సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన సరికొత్త టెక్నాలజీస్ ఏంటంటే?
తెలుగు వెండితెర మీద ఎంతో మంది స్టార్లు మెరిసారు. అయితే కొందరు మాత్రమే ఎప్పటికీ స్టార్లుగా మిగిలిపోతారు. వాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ, 17సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే మరెన్నో సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం తెలుగు సినిమాకు కృష్ణ పరిచయం చేసిన సాంకేతిక విషయాలేంటో చూద్దాం. కౌబాయ్ ఫిలిమ్: పశ్చిమ దేశాలకు చెందిన కౌబాయ్ చిత్రకథలను మొదటిసారిగా తెలుగులోకి తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ. కౌబాయ్ జోనర్ లో రూపొందిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం అప్పట్లో మంచి విజయం అందుకుంది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళం, హిందీ భాషల్లో డబ్ అయ్యింది.
ఈనాడుతో ఈస్ట్ మన్ కలర్
మొదటి డీటీస్ చిత్రం: డీటీఎస్ సౌండ్ తో తెలుగులో రిలీజైన మొదటి చిత్రం కృష్ణ నటించిన తెలుగు వీరలేవరా. 1995లో రిలీజైంది. మొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం: 1982లో తెలుగులో ఈనాడు మూవీ తో మొట్ట మొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం రిలీజ్ అయ్యింది.ఈ టెక్నాలజీని చాలా రోజులు వాడారు. మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం: అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగులో మొట్ట మొదటి సినిమా స్కోప్ చిత్రంగా నిలిచింది. 1974లో రిలీజైన ఈ చిత్రం, కృష్ణ కెరీర్ లో 100వ చిత్రంగా రూపొందింది. మొదటి 70ఎమ్ఎమ్ స్టీరియోఫోనిక్ సౌండ్ చిత్రం: ఈ టెక్నాలజీతో 1986లో సింహాసనం అనే చిత్రాన్ని తెరకెక్కించారు కృష్ణ.