Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ అంటే అది మనది కాదులే, మనకు రాదులే అని ఆలోచించే రోజులనుండి ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడే రోజులు వచ్చేసాయి. దానికి కారణం రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా జెండాను రెపరెపలాడించిన దర్శకుడాయన. అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ ని నాటు నాటు పాటతో భారతదేశానికి తెచ్చిన ఘనుడాయన. ఈ సంవత్సరం భారతదేశానికి రెండు ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే, మరొకటి ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ కి వచ్చింది. ప్రస్తుతం 2024సంవత్సరపు ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుండి సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఇప్పటివరకు 22సిమాలు అప్లై చేసుకున్నాయి
భారతదేశపు అధికారిక ఎంట్రీగా పంపించేందుకు ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి సారథ్యంలో కార్యచరణ జరుగుతోంది. 17 మంది సభ్యులతో కూడిన ఈ ఆస్కార్ కమిటీ, ఎంట్రీకి వచ్చిన సినిమాలను వీక్షిస్తోంది. ఈ ఎంట్రీ సాధించేందుకు ఇప్పటివరకు 22 సినిమాలు అప్లై చేసుకున్నాయి. అందులో తెలుగు నుండి బలగం, దసరా సినిమాలు ఉన్నాయి. అలాగే తమిళం నుండి విడుదలై-1 ఉంది. ఇంకా జ్విగాటో, ది కేరళ స్టోరీ, గదర్-2, రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని, ది స్టోరీ టెల్లర్ వంటి సినిమాలు అప్లై చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా అప్లై చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. మరి వీటన్నింటి లోంచి భారతదేశ అధికారిక ఎంట్రీగా ఆస్కార్ అవార్డుకు వెళ్లేది ఏ సినిమానో చూడాలి.