Loading...
CJP protest: ముంబయి నిరసనల్లో ఉద్రిక్తత.. ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీకి గాయాలు!
ముంబయి నిరసనల్లో ఉద్రిక్తత.. ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీకి గాయాలు!

CJP protest: ముంబయి నిరసనల్లో ఉద్రిక్తత.. ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీకి గాయాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనకోడలు, నటి జైన్ మేరీ ఇటీవల ముంబయిలో జరిగిన సీజేపీ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని, కొన్ని గంటల తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్ వద్ద శనివారం జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న సమయంలో పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని జైన్ మేరీ ఆరోపించారు. ఈ మేరకు తాజాగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తనకు తగిలిన గాయాలను చూపించారు. 'మమ్మల్ని మరింతగా భయపెట్టాలని చూడకండి. మాలో అసలు భయమనేదే లేకుండా పోతుంది'' అని జైన్ మేరీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వివరాలు

పోలీస్ వ్యాన్ లో స్టేషన్ కు తరలింపు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన ఈ నిరసనలో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.

ఆయనను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిరసనలో పాల్గొన్న జైన్ మేరీ, ఇమ్రాన్ ఖాన్‌లను పోలీసులు వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం కొన్ని గంటల పాటు అదుపులో ఉంచి విడుదల చేశారు. అయితే, పోలీసుల ప్రవర్తనపై జైన్ మేరీ తాజాగా వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదు చేస్తానంటున్న కిరీట్ సోమయ్య

మరోవైపు నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య వెల్లడించారు.

ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ అసంపూర్ణంగా ఉందని సోమయ్య ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ విదేశీ పౌరుడని పేర్కొన్న ఆయన.. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదా, వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయనున్నట్లు కిరీట్ సోమయ్య తెలిపారు.

ఒకవైపు నిరసన సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ జైన్ మేరీ ఆరోపణలు చేయగా, మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌పై ఫిర్యాదు చేస్తానని కిరీట్ సోమయ్య ప్రకటించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా, సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

ADVERTISEMENT