
Thalapathy'Vijay: రాజకీయ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ టాప్ హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని చాలా నెలలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపైనే దృష్టి సారిస్తాడని కూడా రూమర్లు వచ్చాయి.
ఇప్పుడు తలపతి విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
పార్టీ పేరు "తమిళగ వెట్రి కజగం" అని ఆయన వెల్లడించారు.
రాజకీయ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లు కూడా ఏర్పాటు చేశారు.
దీని ద్వారా పార్టీకి ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే విజయ్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
Details
పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తా: విజయ్
రాజకీయాలు అంటే అంకితభావంతో కూడిన ప్రజాసేవ అని పేర్కొన్న విజయ్, తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని స్పష్టం చేశారు.
విజయ్ దళపతి 69 తన చివరి చిత్రం అని ధృవీకరించారు. పార్టీకి సంబంధించిన పనులకు అంతరాయం కలిగించకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని విజయ్ చెప్పారు.
విజయ్ ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో పీక్‌లో ఉన్నందున ఈ నిర్ణయం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజకీయ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్
Thalapathy Vijay starts his own political party in the name of Tamizhaga Vettri Kazhagam (TVK). pic.twitter.com/Zi7tpTMhUv
— LetsCinema (@letscinema) February 2, 2024