తదుపరి వార్తా కథనం
Thama Teaser: 'థామా' టీజర్ రిలీజ్.. రష్మిక-ఆయుష్మాన్ జంటగా కొత్త అనుభూతి!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 19, 2025
01:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'థామా' (Thama). ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. రష్మిక గతంలో చెప్పినట్లుగానే, అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. హారర్ నేపథ్యం ఉన్నప్పటికీ, కథలో ప్రధానంగా ప్రేమకథే నడిపించే అంశంగా కనిపిస్తోంది. అందువల్ల ఈ సినిమా రొమాన్స్, హారర్, ఫాంటసీ మిశ్రమంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని చిత్రబృందం నమ్ముతోంది.