LOADING...
Thandel Trailer: 'తండేల్‌ అంటే ఓనరా..?', ' కాదు లీడర్‌'.. నాగచైతన్య 'తండేల్‌' ట్రైలర్‌ అదుర్స్‌

Thandel Trailer: 'తండేల్‌ అంటే ఓనరా..?', ' కాదు లీడర్‌'.. నాగచైతన్య 'తండేల్‌' ట్రైలర్‌ అదుర్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
07:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్‌', 'తండేల్‌ అంటే ఓనరా..?', 'కాదు లీడర్‌' లాంటి పవర్‌ఫుల్‌ డైలాగులతో తండేల్‌ ట్రైలర్‌ విడుదలైంది. యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్‌. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబం నేపథ్యంలో ఈ చిత్ర కథ రూపొందింది.

వివరాలు 

ఫిబ్రవరి 7న విడుదల 

2018లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంస్కృతిక, సామాజిక అంశాలు అలాగే మత్స్యకారుల జీవిత శైలిని ఇందులో చూపించారు. ఈ కథలో రాజు అనే మత్స్యకారుడు పొరపాటుగా పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాడు. దాంతో పాక్‌ నేవీ అధికారులు అతనిని అరెస్టు చేస్తారు. ఈ సంఘటన ఆధారంగా తండేల్‌ కథ రూపొందించబడింది. ఆ జాలరిని తిరిగి భారత్‌కు తీసుకురావడం కోసం అతని ప్రేయసి చేసిన పోరాటం ఏమిటనేది సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.