
Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
పా ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో విడుదలైన 'తంగలాన్' ఈ ఏడాది ప్రేక్షకులను అలరిచింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సాధించినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
భారీ అంచనాల నడుమ రూపొందించిన 'తంగలాన్' స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రంగా నిలిచింది. విక్రమ్, పా రంజిత్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో విక్రమ్, పార్వతి తిరువొతు, మాళవిక మోహన్, పశుపతి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా కోలార్ బంగారు క్షేత్రం నేపథ్యంలో సాగుతుంది.
Details
త్వరలోనే తేదీని ప్రకటించనున్న నెట్‌ఫ్లిక్స్
బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 'తంగలాన్' సినిమాను థియేటర్‌లో చూడలేక పోయిన ప్రేక్షకులు ఓటీటీలో విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ చిత్రం ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాలేదు. నవంబర్ 14న విడుదల కానున్న కంగువా సినిమా ప్రమోషన్ సందర్భంగా 'తంగలాన్' ఓటీటీ విడుదలకు సంబంధించిన ప్రశ్నలకు సమధానం ఇచ్చారు.
తంగలాన్‌ను ప్రత్యేకమైన రోజున విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు.
'తంగలాన్' సినిమాను ఎక్కువ మంది అభిమానులకు అందించడానికి దీపావళి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ నుంచి స్పష్టత రానుంది.