తదుపరి వార్తా కథనం
బడా హీరో కూతురితో తరుణ్ పెళ్ళి అంటూ వార్తలు: స్పందించిన లవర్
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 02, 2023
02:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
బాలనటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్, నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు తరుణ్. అయితే గతకొన్ని రోజులుగా తరుణ్ పెళ్ళి గురించి అనేక వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లోని బాడా హీరో కూతురితో తరుణ్ పెళ్ళి జరగబోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై తరుణ్ స్పందించాడు. తన పెళ్ళిపై వస్తున్న వార్తలు ఆధారం లేనివని, అలాంటి పుకార్లను నమ్మవద్దని, పెళ్ళికి సంబంధించిన శుభవార్తను తప్పకుండా తానే పంచుకుంటానని తరుణ్ అన్నారు.
మొత్తానికి తరుణ్ పెళ్ళిపై వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లే.