LOADING...
Amani: ఆ కారణం వల్లే చిరంజీవితో నటించలేదు
ఆ కారణం వల్లే చిరంజీవితో నటించలేదు

Amani: ఆ కారణం వల్లే చిరంజీవితో నటించలేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి ఆమని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వివరించడంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె చెప్పిన ప్రకారం, స్టాలిన్ సినిమాలో ఒక కీలక పాత్రను తిరస్కరించడం పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది. ఈ చిత్రం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందింది. ఆమని మాట్లాడుతూ.. చిరంజీవి గారంటే నాకు ఎంతో ఇష్టం.

వివరాలు

చెల్లెల్లి పాత్ర కోసం సంప్రదించారు

ఆయన నా డ్రీమ్ హీరో. ఆయనతో కనీసం ఒక సినిమాలోనైనా హీరోయిన్‌గా నటించాలని ఎప్పటినుంచో ఆశపడ్డాను. అయితే 'స్టాలిన్' సినిమాలో ఆయన చెల్లెలి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ నా డ్రీమ్ హీరోను అన్నయ్యగా ఊహించుకోవడం నాకు సాధ్యపడలేదు. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. తన కెరీర్‌లో చిరంజీవితో హీరోయిన్‌గా నటించే అవకాశం రాకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. కనీసం ఇప్పుడు అయినా ఆయన సరసన ఒక మంచి పాత్రలో కనిపించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement