Loading...
Dhanush: అప్పుడే నా పుట్టిన రోజు అని తెలిసింది : ధనుష్
అప్పుడే నా పుట్టిన రోజు అని తెలిసింది : ధనుష్

Dhanush: అప్పుడే నా పుట్టిన రోజు అని తెలిసింది : ధనుష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో 'ధనుష్' తన చిన్ననాటి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన.. చిన్నప్పుడు తన పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అలాగే బాల్యంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ధనుష్ మాట్లాడుతూ.. జులై 28 నాకు ఒకప్పుడు సాధారణ తేదీ మాత్రమే. చిన్నతనంలో నా స్నేహితులు తమ పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు వేసుకుని, స్కూల్లో చాక్లెట్లు పంచుతుంటే చాలా కొత్తగా అనిపించేది. వాళ్లను చూసి నేనూ అలానే పుట్టినరోజు జరుపుకోవాలని అనుకునేవాడిని. కానీ నేను నాలుగో తరగతి చదివే వరకు నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదని చెప్పారు.

వివరాలు

జులై 28 అని చెప్పింది

ఆ విషయం గురించి తన అక్కను అడిగినప్పుడు.. నీ పుట్టినరోజు జులై 28 అని చెప్పిందని ధనుష్ గుర్తు చేసుకున్నారు.

మా అమ్మానాన్నలు మాకు కేవలం దీపావళి, సంక్రాంతి పండుగలకే కొత్త బట్టలు కొనిచ్చేవారు. కానీ నా పుట్టినరోజుకు కూడా కొత్త డ్రెస్ కావాలని నేను పట్టుబట్టి కొనిపించుకున్నాను.

అలాగే నా దగ్గర ఉన్న డబ్బులతో 'ఆశ' చాక్లెట్లు కొనుగోలు చేసి స్కూల్లో అందరికీ పంచేవాడిని. అలా చాక్లెట్లు పంచుతున్నప్పుడు నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించేదని చెప్పారు.

వివరాలు

సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి

కాలక్రమేణా పుట్టినరోజుపై తన ఆసక్తి తగ్గిపోయిందని ధనుష్ వెల్లడించారు. చిన్నప్పుడు ఆ ఒక్క రోజు నాకు ప్రపంచంలా అనిపించేది.

కానీ ఇప్పుడు నా పుట్టినరోజును అభిమానులు ఇంత ఘనంగా జరుపుకోవడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు.

అలాగే తన అభిమానులకు ధనుష్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సినిమాలకు సంబంధించిన వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని కోరారు.

ముఖ్యంగా స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT