Unni Mukundan: సినిమాల్లో ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలకు నో చెప్పిన నటుడు!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇటీవల మార్కో సినిమాతో విజయాన్ని అందుకున్నారు.
పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రాల్లో నటించడమే తనకు ఇష్టమని, తన సినిమాలను అన్ని వయసుల వారు వీక్షించాలనేదే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, దర్శక-నిర్మాతలు ఎంత ఒత్తిడి తెచ్చినా, కొన్ని విషయాలను ఎప్పటికీ అంగీకరించని స్పష్టం చేశారు.
సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడే ముద్దు, ఇంటిమేట్ సీన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.
ఇప్పటి వరకు తన నటనా ప్రస్థానంలో ఆ నిర్ణయాన్ని కచ్చితంగా పాటించానని, తన సినిమాలు ప్రతి వయస్సు వారూ కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగేలా ఉండాలని పేర్కొన్నారు.
Details
సిద్దాంతాలను మార్చుకోం
ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు ఈ విషయంలో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఇతర హీరోల సినిమాలను చూపిస్తూ, మీరు కూడా చేయొచ్చని చెప్పారన్నారు.
అయితే ఒక జంట మధ్య రొమాన్స్ చూపించేందుకు ముద్దు తప్పనిసరి కాదనేది తన నమ్మకమన్నారు.
ఇతర నటులు అలాంటి సన్నివేశాల్లో నటించడం వారి వ్యక్తిగత నిర్ణయమని, కానీ తాను మాత్రం తన సిద్ధాంతాలను మార్చుకోనని ఉన్ని ముకుందన్ తెలిపారు.
మలయాళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉన్ని ముకుందన్, తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి, యశోద వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆయన నటించిన 'మార్కో' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది.