LOADING...
Rajnikanth173 : థలైవర్ 173కి దర్శకుడు ఖరారు: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న సిబి చక్రవర్తి  
థలైవర్ 173కి దర్శకుడు ఖరారు: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న సిబి చక్రవర్తి

Rajnikanth173 : థలైవర్ 173కి దర్శకుడు ఖరారు: రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయనున్న సిబి చక్రవర్తి  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించనున్న 'థలైవర్ 173' సినిమాకు దర్శకుడు ఎవరన్న అంశంపై కొద్ది రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలికింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు'డాన్' సినిమాతో గుర్తింపు పొందిన సిబి చక్రవర్తి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్'పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొదటగా ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం సిబి చక్రవర్తి పేరును ప్రకటించారు.మధ్యలో సిబి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపించాయి.

వివరాలు 

'జైలర్ 2' చిత్రీకరణను పూర్తిచేసిన తర్వాత కొత్త సినిమా

ఆయన స్థానంలో అశ్వత్ మారిముత్తు పేరు కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే చివరకు సిబి చక్రవర్తి వినిపించిన కథనే రజనీకాంత్ ఆమోదించినట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణను పూర్తిచేసిన తర్వాత ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆయన కొత్తదనంతో కూడిన ఆకర్షణీయమైన రూపంలో కనిపించనున్నారని సమాచారం. దర్శకుడు సిబి చక్రవర్తి తన ప్రత్యేక వినోద శైలిలో కథను సిద్ధం చేసినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.రజనీకాంత్ సినిమా పూర్తయ్యాక సిబి చక్రవర్తి తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని రూపొందించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement