ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలిని 2 కోట్లు కోరిన బొమ్మన్, బెల్లీ
ఈ వార్తాకథనం ఏంటి
95వ ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ఇండియాకు చెందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే.
ది ఎలిఫెంట్ విస్పరరస్ డాక్యుమెంటరీలో బొమ్మన్, బెల్లీ అనే నిజమైన ఏనుగు సంరక్షకులు కనిపించారు. అయితే ప్రస్తుతం బొమ్మన్, బెల్లీ.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
డాక్యుమెంటరీకి గుర్తింపు వస్తే, తమకు ఆర్థికంగా సహాయం చేస్తామని డాక్యుమెంటరీ మొదలు పెట్టకముందు దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ చెప్పారని, అలాగే బెల్లీ మనవరాలి చదువుకు ఆర్థికంగా సహాయం చేస్తామని మాటిచ్చారని బొమ్మన్, బెలీ చెబుతున్నారు.
కానీ, డాక్యుమెంటరీ పూర్తయ్యాక తమకు సహాయం అందలేదని ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు.
Details
బొమ్మన్, బెల్లీకి కార్తికి గోన్సాల్వేస్ సమాధానం
ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలు చేసిన ప్రామిస్ లు నెరవేర్చనందున, ఆమెను 2కోట్లు కోరుతూ లీగల్ నోటీసులను బొమ్మన్, బెల్లీ అందజేసారు.
డాక్యుమెంటరీ హిట్ అయిన తర్వాత తమకు చేస్తానన్న సాయం గురించి అడుగుదామని కార్తికి గోన్సాల్వేస్ కు కాల్ చేస్తే ఆమె రెస్పాండ్ కాలేదని బొమ్మన్ అంటున్నారు.
అయితే, బొమ్మన్, బెల్లీ పంపిన లీగల్ నోటీసుకు సమాధానంగా కార్తికి గోన్సాల్వేస్ కూడా తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చింది.
బొమ్మన్, బెల్లీకి డబ్బు సహాయం చేసామని, అయినా కూడా వారు నిరాధారమైన మాటలు మాట్లాడుతున్నారని కార్తికి గోన్సాల్వేస్ సమాధానం ఇచ్చారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు దారి తీస్తుందో చూడాలి.