SAHAA Trailer : టాలీవుడ్ నుంచి మరో ప్రేమకథ.. ఆసక్తికరంగా 'సహ' ట్రైలర్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యువ నటులు శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటించిన తాజా చిత్రం 'సహ (లైఫ్ ఆఫ్ సంజు)' (SAHAA Life of Sanju). నిశాంత్ దోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించారు. వ్రజన పాండ్య, మహిపాల్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
వివరాలు
సంజు అనే యువకుడి జీవిత ప్రయాణమే కథాంశం..
సంజు అనే యువకుడి జీవిత ప్రయాణమే కథాంశం. అతని జీవితంలో ఎదురైన తొలిప్రేమ, బ్రేకప్ తర్వాత కలిగే బాధ, మధురమైన జ్ఞాపకాలు, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ట్రైలర్‌లో సహజంగా ఆవిష్కరించారు.
ప్రేమలోని ఆనందం, బాధ, భావోద్వేగాలను మేళవిస్తూ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది.
వివరాలు
సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి..
కేవలం ప్రేమకథగానే కాకుండా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలను తెరపై చూపించే చిత్రంగా 'సహ' ఉండనుంది.
ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.