LOADING...
Dhurandhar 2: సీక్వెల్ క్రేజ్ ప్రభావం.. నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' వ్యూస్ జోరు
సీక్వెల్ క్రేజ్ ప్రభావం.. నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' వ్యూస్ జోరు

Dhurandhar 2: సీక్వెల్ క్రేజ్ ప్రభావం.. నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' వ్యూస్ జోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే తొలి భాగంతో సంచలనం సృష్టించి రికార్డులు నెలకొల్పిన ధురంధ‌ర్‌ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న రెండో భాగం ఇప్పుడు మరింత హైప్‌ను తెచ్చుకుంటోంది. ర‌ణ‌వీర్ సింగ్‌ ప్రధాన పాత్రలో, అధిత్య థార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ధురంధ‌ర్ 2మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మొదటి భాగం మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా నెట్ ఫ్లిక్స్‌ లో మంచి ఆదరణ పొందుతోంది. పార్ట్‌ 2 విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రేక్షకులు మొదటి భాగాన్ని మరోసారి వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం వరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలో టాప్‌ 5జాబితాలో ఉన్న 'ధురంధర్‌' సినిమా ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది.

Details

మార్చి 19న రీలీజ్ 

ఇప్పటివరకు ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌లో 2.2 కోట్లకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. కేవలం భారత్‌లోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రం టాప్‌ 10లో ట్రెండ్ అవుతోంది. మార్చి 19న 'ధురంధర్‌ 2' విడుదల కానుండగా, అదే సమయంలో ఉగాది మరియు ఈద్ పండుగల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా మంచి స్పందనను అందుకుంది. ధురంధ‌ర్ 2 ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అన్ని భాషలు కలిపి ఇప్పటివరకు 312 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం.

Advertisement