Loading...
Mahakali: 'మహాకాళి' గ్లింప్స్‌ వచ్చేసింది.. శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

Mahakali: 'మహాకాళి' గ్లింప్స్‌ వచ్చేసింది.. శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హనుమాన్‌' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి మరో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'మహాకాళి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'శుక్రాచార్యుడి యుద్ధరావం' పేరుతో ఫస్ట్‌ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా రాక్షసుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. 'ది ఎండ్‌ బిగిన్స్‌' (అంతం మొదలవుతుంది) అనే ట్యాగ్‌లైన్‌తో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. ఇందులో అక్షయ్‌ ఖన్నా లుక్‌, ఆయన డైలాగ్‌ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివరాలు

శుక్రాచార్యుడి పాత్ర కీలకం

'హనుమాన్‌' ప్రపంచానికి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది.

ప్రశాంత్‌ వర్మ మార్క్‌ విజువల్స్‌తో పాటు సౌండ్‌ డిజైన్‌ కూడా గ్లింప్స్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.

భారీ యాక్షన్‌, పౌరాణిక అంశాలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

భారీ తారాగణంతో 'మహాకాళి'

'మహాకాళి' చిత్రానికి ప్రశాంత్‌ వర్మ కథ, కాన్సెప్ట్‌ అందించడంతో పాటు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆర్‌కేడీ స్టూడియోస్‌ పతాకంపై రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమి శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అక్షయ్‌ ఖన్నాతో పాటు శ్రియా రెడ్డి, రోహిత్‌ సరాఫ్‌, సముద్రఖని, నాజర్‌, మురళీ శర్మ, రజత్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్మరణ్‌ సాయి సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

సంక్రాంతికి పాన్‌ ఇండియా రిలీజ్

'మహాకాళి'ని 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

'హనుమాన్‌'తో ప్రశాంత్‌ వర్మ క్రియేట్‌ చేసిన PVCUపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో 'మహాకాళి'లో శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ADVERTISEMENT