Hanuman: కలెక్షన్స్‌లో అదరగొడుతున్న 'హనుమాన్'.. అమెరికాలో రికార్డులు బద్దలు
యువ హీరో తేజ సజ్జా.. ట్యాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హను-మాన్'. సంక్రాంతి కానుకగా దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ.. సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. స్టార్ హీరోలను పక్కకు నెట్టి.. సంక్రాంతి విన్నర్‌గా తేజ సజ్జా నిలిచాడు. సినిమా రిలీజ్ అయి పదిరోజులు అవుతున్నా.. కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ గ్రాస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150కోట్లను దాటింది. ప్రస్తుతం ఫుల్ ప్రాఫిట్స్‌లో సినిమా నడుస్తోంది. అలాగే కలెక్షన్ల విషయంలో సినిమా సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నార్త్ ఇండియా, యూఎస్‌లో దూసుకుపోతోంది. దక్షిణాదిన ఇప్పటికే రూ.25 కోట్ల వరకు హనుమాన్ సినిమా కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపర్చింది.
అమెరికాలో ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ సినిమాలను దాటి..
ఇక, అమెరికా విషయానికి వస్తే.. హనుమాన్ మూవీ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కేవలం 9రోజుల్లోనే 4 మిలియన్ డాలర్స్(రూ.32)ను ఈ సినిమా రాబట్టింది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 జాబితాలో హనుమాన్‌కు చోటు దక్కింది. బాహుబలి 2 (20 మిలియన డాలర్స్), ఆర్ఆర్ఆర్ ( 14.3 మిలియన డాలర్స్), సలార్ (8.9 మిలియన డాలర్స్), బాహుబలి 1 (8 మిలియన డాలర్స్) తర్వాత నాలుగు మిలియన డాలర్ల కలెక్షన్స్ రాబట్టిన హనుమాన్ అత్యధిక వసూళ్లు సాధించిన 5వ చిత్రంగా నిలిచింది. ఒక చిన్న హీరోకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డు అనే చెప్పాలి.