The Paradise : 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి.. నాని మూవీకి 'A' సర్టిఫికెట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'. న్యాచురల్ స్టార్ నాని,దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు సమాచారం. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ఈ చిత్రానికి 'A' (అడల్ట్)సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సర్టిఫికేషన్ సినిమా రఫ్ కట్‌కు మాత్రమే సంబంధించినదని ప్రచారం జరుగుతోంది. ఫైనల్ కట్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని సమాచారం.ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు నేపధ్యసంగీతానికి సంబంధించి అనిరుధ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు.
వివరాలు
సెన్సార్ సర్టిఫికేషన్‌పై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఇప్పటివరకు సినిమా ఫస్టాఫ్కు మాత్రమే రీ-రికార్డింగ్ (RR) పూర్తయినట్లు తెలుస్తోంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్,ఇతర నిర్మాణానంతర పనులను వేగవంతం చేసేందుకు చిత్రబృందం ముందుగా రఫ్ కట్‌ను సెన్సార్ పరిశీలనకు పంపినట్లు సమాచారం.
ఫైనల్ కట్ లాక్ అయిన తర్వాత సినిమా నిడివి,కొన్ని సన్నివేశాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటం,యాక్షన్ ఘట్టాల్లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండటం,కథా నేపథ్యం వంటి అంశాల కారణంగానే 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫైనల్ కట్ పూర్తయి,లాక్ అయిన తర్వాత సెన్సార్ సర్టిఫికేషన్‌పై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.