Page Loader
Peddi : 'పెద్ది' రొమాంటిక్ సాంగ్‌కు సెట్ క్లియర్.. ఎక్కడంటే!
'పెద్ది' రొమాంటిక్ సాంగ్‌కు సెట్ క్లియర్.. ఎక్కడంటే!

Peddi : 'పెద్ది' రొమాంటిక్ సాంగ్‌కు సెట్ క్లియర్.. ఎక్కడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ప్యాన్‌ ఇండియా మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'పెద్ది'పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 'గేమ్‌ ఛేంజర్‌' తర్వాత చరణ్‌ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు. మాస్‌ ఎమోషన్‌, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌, స్పోర్ట్స్‌ డ్రామా అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఇటీవల విడుదలైన 'పెద్ది ఫస్ట్ షాట్'కు మంచి స్పందన లభించడంతో సినిమా పట్ల ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది.

Details

జూలై 12న ఢిల్లీలో షెడ్యూల్

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్‌ సాంగ్‌ రూమర్‌ ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ గాసిప్‌ ఇంకా అధికారికంగా రాకపోయినా, ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తదుపరి షెడ్యూల్‌ జూలై 12న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌లపై కొన్ని ముఖ్యమైన రొమాంటిక్‌ సన్నివేశాలతో పాటు రెండు పాటల చిత్రీకరణ కూడా జరగనున్నట్లు సమాచారం. షూటింగ్‌కు ఇంకా సుమారు 40 రోజులు మిగిలి ఉండగా, ఆగస్టు నాటికి మొత్తం ముగించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏఆర్‌ రెహమాన్‌ ట్యూన్లు ఇప్పటికే హైప్‌ను పెంచుతున్నాయి. అలాగే దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్‌కుమార్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.