Kannappa:'చాలా నమ్మకం ఉంది'.. కన్నప్ప మూవీపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పలు సరదా కార్యక్రమాలలో పాల్గొని, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
తన తాజా సినిమా 'కన్నప్ప' గురించి వివరించారు. ఈ సినిమా కోసం చేసిన కష్టాలు, ఖర్చులు గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పెద్ద మొత్తంలో ఈ సినిమా కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఆ సమయంలో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌ను ఆయన గుర్తు చేశారు.
నిన్న జరిగినది మర్చిపోను. నేడు ఏం చేయాలా? అని ఆలోచించాలని అన్నారు.
అలాగే సంక్రాంతి పండుగపై మాట్లాడుతూ ఇది రైతు పండుగ అని, రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పారు.
Details
ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్
కన్నప్ప సినిమాకు సంబంధించిన ప్రగతి గురించి చెప్పారు. గ్రాఫిక్స్ వర్క్‌లు కొనసాగుతున్నాయన్నారు.
సినిమా చాలా ప్యాషనతో చేశామని, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. ఈ సినిమా పై తమకెంతో నమ్మకం ఉందన్నారు. ఇది విజయవంతం అవ్వాలని మోహన్‌బాబు కోరుకున్నారు.
కన్నప్ప సినిమాను విష్ణు కలల ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్ కాజల్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.