Page Loader
Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్ 
Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్

Animal trailer: వరల్డ్ కప్‌లో 'యానిమల్' ట్రైలర్ ఆవిష్కరణ.. మేకర్స్ ప్లాన్ 

వ్రాసిన వారు Stalin
Nov 14, 2023
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'యానిమల్'. డిసెంబర్ 1 న ఈ సినిమాను భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 'యానిమల్' ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను ఈవెంట్‌ను ప్రపంచ కప్‌ వేదికపై నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ 'యానిమల్ 1' బ్లూ జెర్సీని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ గ్యాప్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'యానిమల్ 1'  అని ఉన్న బ్లూ జెర్సీని ధరించిన రణబీర్ కపూర్