Page Loader
Ganesh Chaturhi Songs: వినాయక చవితి సందర్భంగా టాప్ సాంగ్స్ లిస్టు ఇవే!

Ganesh Chaturhi Songs: వినాయక చవితి సందర్భంగా టాప్ సాంగ్స్ లిస్టు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2023
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయకుని పాటలతో మండపాలు మార్మోమ్రోగుతూనే ఉంటాయి. ఇప్పటికే తెలుగు చిత్రాల్లో చాలా పాటలు వినాయకుడి పేరు మీదు వచ్చాయి. కొన్ని పాటలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ గుర్తిండిపోయాయి. ఇక యువకులు డీజే పాటలతో వినాయకచవితి స్పేషల్ పాటలతో సందడి చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బాగా అలరించిన కొన్ని సాంగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జై జై గణేశా.. జై కొడతా గణేశా గణేష్ చతుర్ధి రోజున ఈ పాట ప్రతి మండలంలోనూ ప్లే చేస్తారు. ఈ పాట జై చిరంజీవా సినిమాలోనిది. ఈ పాటను బాలసుబ్రమణ్యం పాడారు.

Details

దండాలయ్య.. ఉండ్రాలయ్య పాటను పాడిన బాల సుబ్రమణ్యం

గణపతి బప్పా మోరియా ఈ పాట సంప్రదాయ పాట కంటే ఆధునిక కాలపు పాటగా చెప్పొచ్చు. 'వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమ ప్రభ గణపతి బప్పా మోరియా' అంటూ ఈ పాటను సూరజ్ జగన్ పాడారు. దండాలయ్య.. ఉండ్రాలయ్య తెలుగులో ఈ పాట కూలీ నెం.1 చిత్రంలోనిది. గణేష్ నిమజ్జనం సమయంలో వచ్చే ఈ పాటలో వెంకటేష్, టబుని టీజ్ చేశాడు. 'దండాలయ్యా ఉండ్రాలయ్యా కరుణించయ్య దేవా, నీ అంద దండ ఉండలయ్యా చూపించయ్య దేవా' అంటూ సాగే ఈ పాటను ది గ్రేట్ బాల సుబ్రహ్మణ్యంగారు పాడారు.