Loading...
The Traitors Telugu: 'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 విజేతలు వీళ్లే.. రూ.42.77 లక్షలు సొంతం!
'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 విజేతలు వీళ్లే.. రూ.42.77 లక్షలు సొంతం!

The Traitors Telugu: 'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 విజేతలు వీళ్లే.. రూ.42.77 లక్షలు సొంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పాపులర్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' తెలుగు సీజన్ 1 ముగిసింది. ఎన్నో అనూహ్య మలుపులు, అనుమానాలు, వ్యూహాలు, మోసాలతో ప్రేక్షకులను అలరించిన ఈ గేమ్‌లో చివరకు శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి విజేతలుగా నిలిచారు. వీరిద్దరూ కలిసి రూ.42,77,000 ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి తొలుత ఇన్నోసెంట్స్‌గా గేమ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఆట సాగుతున్న కొద్దీ చోటుచేసుకున్న పరిణామాలతో వీరిద్దరూ ట్రైటర్స్‌గా మారారు. రహత్, ఆశికా ద్వారా స్వీకర్ ట్రైటర్‌గా మారగా.. బ్లాక్‌మెయిల్ ఆహ్వానం అందుకోవడంతో శ్రావ్య కూడా ట్రైటర్స్ టీమ్‌లో చేరింది.

వివరాలు

ఆసక్తికరంగా ట్రైలర్

ఫైనల్ ఎపిసోడ్‌లో తేజ సజ్జా చివరి మర్డర్‌కు గురైన ప్రణవ్ గురించి వెల్లడించారు. మరోవైపు ధనుంజయ్.. శ్రావ్య, స్వీకర్‌లపై అనుమానం వ్యక్తం చేశాడు.

వారిద్దరూ ట్రైటర్స్ అని గుర్తించి బయటపెట్టేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా శ్రావ్యను, స్వీకర్‌ను గేమ్ నుంచి బయటకు పంపించి తాను ఒంటరిగా విజయం సాధించాలని కూడా సూచించాడు.

అయితే మిగతా కంటెస్టెంట్లు ధనుంజయ్ అనుమానాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో చివరి రింగ్ ఆఫ్ డౌట్‌లో ధనుంజయ్ ఎలిమినేట్ అయ్యాడు.

చివరకు శ్రావ్య, స్వీకర్, వర్ష, మేఘనాథ్ మాత్రమే గేమ్‌లో మిగిలారు. తొలుత వర్ష ఎలిమినేట్ అయింది.

ఆ తర్వాత చివరి దశలో కంటెస్టెంట్ల ముందు ట్రస్ట్ లేదా డౌట్ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

తన అనుభవాలను పంచుకున్న శ్రావ్య వర్మ

ఈ సమయంలో మేఘనాథ్ డౌట్‌ను ఎంచుకోగా.. శ్రావ్య, స్వీకర్ మాత్రం ట్రస్ట్‌ను ఎంచుకున్నారు. దీంతో వీరిద్దరూ ట్రైటర్స్ అనే అసలు నిజం బయటపడింది.

ఇలా ఇన్నోసెంట్స్‌గా ఆటను ప్రారంభించిన శ్రావ్య, స్వీకర్.. చివరకు ట్రైటర్స్‌గా మారి విజేతలుగా నిలిచారు. విజయం అనంతరం శ్రావ్య వర్మ తన అనుభవాలను పంచుకుంది.

మొదట కనీసం మూడు ఎపిసోడ్ల వరకు అయినా షోలో కొనసాగాలని అనుకున్నానని, చివరకు విజేతగా నిలుస్తానని అస్సలు ఊహించలేదని తెలిపింది.

ఈ ప్రయాణంలో ఎన్నో స్నేహాలను సంపాదించుకోవడం తనకు దక్కిన పెద్ద విజయమని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనూ మూవీ

అయితే గేమ్‌లో గెలవడం కోసం తనకు ఇష్టమైన వ్యక్తులను బాధపెట్టాల్సి రావడం కొంత బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది.

మరోవైపు విజేత స్వీకర్ అగస్తి మాట్లాడుతూ.. మొదటి నుంచీ ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనిస్తూ, వారి ప్రవర్తనను అర్థం చేసుకుంటూ గేమ్ ఆడానని వెల్లడించాడు.

శ్రావ్యను తనతో కలుపుకోవడం ఈ ఆటలో తాను తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని తెలిపాడు. చివరి వరకు ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం వల్లే విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు.

SOL Production నిర్మించిన 'ది ట్రైటర్స్ తెలుగు' సీజన్ 1 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోను తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనూ వీక్షించవచ్చు.

ADVERTISEMENT