LOADING...
This Week Telugu Movies: ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్ డోస్‌.. థియేటర్‌లో థ్రిల్‌, ఓటీటీలో కామెడీ
ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్ డోస్‌.. థియేటర్‌లో థ్రిల్‌, ఓటీటీలో కామెడీ

This Week Telugu Movies: ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్ డోస్‌.. థియేటర్‌లో థ్రిల్‌, ఓటీటీలో కామెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2026
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రేక్షకులను మరోసారి థ్రిల్‌ చేసేందుకు ఈ వారం పలు ఆసక్తికర చిత్రాలు సిద్ధమయ్యాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వరకు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఇతర భాషల్లోనూ రీమేక్‌ అయి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ కథ ఇప్పుడు మూడో భాగంతో మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. మోహన్ లాల్ కథానాయకుడిగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ 'దృశ్యం 3' మే 21న విడుదల కానుంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి కథలో భావోద్వేగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు చిత్రబృందం చెబుతోంది.

వివరాలు

మే 22న ప్రేక్షకుల ముందుకు 'అగ్లీ స్టోరీ'

ఇక సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'అగ్లీ స్టోరీ' కూడా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందు, అవికా గోర్ రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్‌ దర్శకత్వం వహించారు. చిన్ననాటి నుంచి ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమె వేరొకరిని ఇష్టపడుతోందని తెలుసుకున్న తర్వాత ఎలా సైకో ప్రవర్తనకు దిగాడు అన్న అంశం చుట్టూ కథ సాగుతుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. '

వివరాలు

ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన పురుషః

'పురుషః' పేరుతో మరో వినోదాత్మక చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు వీరు ఉలవల తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తగిరి, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ఇప్పటివరకు భార్యాభర్తలు, భార్యల కోణంలో వచ్చిన కథలకు భిన్నంగా ఈసారి మగవారి కోణం నుంచి కథ చెప్పే ప్రయత్నం చేశామని, సినిమాలో ప్రత్యేక సర్‌ప్రైజ్‌ మూమెంట్‌ కూడా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది.

Advertisement

వివరాలు

విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం

భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన మరో చిత్రం 'ఫస్ట్‌ టైమ్‌ 01-01-01'. సౌరభ్ ధింగ్రా హీరోగా నటించిన ఈ చిత్రానికి హేమంత్‌ ఇప్పపల్లి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. అనిక విక్రమన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని మే 22న విడుదలకు సిద్ధమైంది. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

కుటుంబ కథా చిత్రంగా రమణీ కళ్యాణం

ఇక కుటుంబ కథా చిత్రంగా రూపొందిన 'రమణీ కళ్యాణం' కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య వశిష్ట, దీప్శిఖ చంద్రన్ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేమ, పెళ్లి, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను జయిస్తూ ముందుకు సాగే యువజంట కథ చుట్టూ సాగనుంది. వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా సమతూకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.

వివరాలు

ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ వన్‌ త్రీ హిల్‌ (వెబ్‌సిరీస్-ఇంగ్లీష్‌) మే 21 జేమ్స్‌: సీజన్‌1 (వెబ్‌సిరీస్-ఇంగ్లీష్‌) మే 21 ది బరోగ్స్‌(వెబ్‌సిరీస్-ఇంగ్లీష్‌)) మే 21 జీ5 వారెంట్‌: ఫ్రమ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ విలంగు (వెబ్‌సిరీస్‌-తమిళ్‌) మే 21 మేము COPలం (వెబ్‌సిరీస్‌-తెలుగు) మే 22 జియో హాట్‌స్టార్‌ జెట్లీ (మూవీ-తెలుగు) మే 25 సన్‌నెక్ట్స్‌ సతీ లీలావతి (మూవీ-తెలుగు) మే 20 అమెజాన్‌ ప్రైమ్‌ బిష్మర్‌ (మూవీ-మలయాళం) మే 22 సిస్టమ్‌ (మూవీ-హిందీ, తెలుగు) మే 22 స్కై +మెడ్‌:సీజన్‌4 (వెబ్‌సిరీస్‌-ఇంగ్లీష్‌) మే22

Advertisement