Page Loader
Tillu Square: కలెక్షన్స్ లో దూసుకుపోతున్న'టిల్లు స్క్వేర్'..కలెక్షన్స్ ఎంతంటే..!
Tillu Square: కలెక్షన్స్ లో దూసుకుపోతున్న'టిల్లు స్క్వేర్'..కలెక్షన్స్ ఎంతంటే..!

Tillu Square: కలెక్షన్స్ లో దూసుకుపోతున్న'టిల్లు స్క్వేర్'..కలెక్షన్స్ ఎంతంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ 'X' వేదికగా ప్రకటించారు. దీంతో మరో రెండు రోజులలో ఈ మూవీ రూ.100 కోట్లు రాబడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా రానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ,సాయి సౌజన్య లు సంయుక్తంగా ఈ చిత్రాన్నీ నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్