Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్
టిల్లు స్క్వేర్ (Tillu Square) గాడు ఓటిటి (ott)లో కి వచ్చేస్తున్నాడు. మార్చి చివరి వారంలో రిలీజై మంచి హిట్ టాక్ సంపాదించుకున్న టిల్లు స్క్వేర్ సినిమాను మేకర్స్ ఓటీటీలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ థియేటర్ లలో ఈసినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వులు పూయించింది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా (Cinema) ఇప్పటికీ థియేటర్ల వద్ద స్ట్రాంగ్ హోల్డింగ్ గా నిలబడి మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది.
సీక్వెల్ గా టిల్లు క్యూబ్ ?
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. సిద్ధు పంచ్ డైలాగ్ లు, దర్శకుడు మల్లిక్ రామ్ స్క్రీన్ ప్లే, అనుపమ పరమేశ్వరన్ స్కిన్ షో ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ సినిమాను మేకర్స్ ఈనెల 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఇక టిల్లు స్వ్కేర్ సినిమాకు సీక్వెల్గా టిల్లు క్యూబ్ కూడా క్యూ లోనే వున్నట్లు సినిమా యూనిట్ హింట్స్ ఇస్తోంది.