
అందరి ముందు హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్: విమర్శిస్తున్న నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం తిరగబడరా సామీ. అమాయకుడైన హీరో అనుకోని కారణాలవల్ల విలన్లను ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కుతున్న తిరగబడరా సామీ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మన్నారా చోప్రాను చిత్ర దర్శకుడు ఏఎస్ రవికుమార్ మీడియా ముందు ముద్దు పెట్టుకున్నాడు.
అందరి ముందు ముద్దు పెట్టుకోవడంతో ఏం చేయాలో తెలియక మన్నారా చోప్రా కిసుక్కున నవ్వేసింది.
Details
తప్పు పడుతున్న నెటిజన్లు
ప్రస్తుతం ఏ ఎస్ రవికుమార్ మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. హీరోయిన్ పట్ల ఇలా వ్యవహరించడాన్ని సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు.
పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం ఏంటని ఏ ఎస్ రవికుమార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరి కొంతమంది నెటిజెన్లు.. ఈ చర్యలన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని అంటున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇదొక ట్రిక్ అని చెబుతున్నారు.
ఏదేమైతేనేం ముద్దు వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదలా ఉంచితే, తిరగబడరా సామీ చిత్రంలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్ గా కనిపిస్తోంది. జేబీ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ముద్దు వీడియో
#PriyankaChopra’s cousin, actress #Mannarachopra gets kissed by director AS Ravikumar in front of the media! 🤦🏼♂️#TiragabadaraSaamipic.twitter.com/54w5JHvjIv
— Ajay AJ (@AjayTweets07) August 29, 2023