Tollywood: టాలీవుడ్‌కు లాభాలే లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఒకసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు ఒక్క హిట్ కూడా లేకుండా బాక్సాఫీస్ వెలవెలబోయింది. అయితే జూన్‌లో మొదలైన విజయాల పరంపర ఆగస్టులో మరింత జోరందుకుంది. ఈ నెలలో ఏకంగా నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దీంతో టాలీవుడ్‌కు సెకండ్ హాఫ్ బాగా కలిసొచ్చినట్టయింది. జనవరిలో సంక్రాంతి సినిమాల విజయాల తర్వాత మరో హిట్ కోసం టాలీవుడ్ దాదాపు ఐదు నెలలు ఎదురుచూడాల్సి వచ్చింది. మధ్యలో వచ్చిన కొన్ని చిన్న లవ్‌స్టోరీలు విజయానికి బాటలు వేశాయి. ఇక ఆగస్టులో మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది.
వివరాలు
క్రేజీ మూవీ..
ఈ నెలలో విడుదలైన సినిమాల్లో హిట్ కోసం స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడ్డాయి.
తమిళంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా తెలుగు హక్కులను రూ.21 కోట్లకు విక్రయించగా.. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇప్పటివరకు రూ.24 కోట్ల షేర్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినిమా ఎవరు తీశారు? ఎవరు నటించారు? అనే విషయాల కంటే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.
క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
వివరాలు
భారీ వసూళ్లు..
తెలుగులో ఒక్క ప్రమోషన్ కార్యక్రమానికి కూడా చిత్ర బృందం హాజరుకాలేదు.
అయినప్పటికీ పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది.
తెలుగు హక్కులను రూ.4 కోట్లకు విక్రయించగా.. ఇప్పటివరకు ఏకంగా రూ.20 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ నెలలో హిట్ సినిమాల్లో ఏ ఒక్కదానికీ టికెట్ రేట్లు పెంచలేదు.
సాధారణ టికెట్ ధరలతోనే సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.
టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడతారనే అభిప్రాయం ఉంది.
అధిక ధరలకు టికెట్లు కొనలేక కొందరు పైరసీ వైపు వెళ్లే అవకాశమూ ఉంటుంది.
ఆగస్టులో విజయవంతమైన ఈ సినిమాలకు ఆ అవకాశం లేకుండా పోయింది. టికెట్ రేట్లు పెంచకపోవడంతో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి.