English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్: తరుణ్ భాస్కర్ రివీల్ చేసిన వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్
    తదుపరి వార్తా కథనం
    బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్:  తరుణ్ భాస్కర్ రివీల్ చేసిన వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్
    వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్ లో బ్రహ్మానందం

    బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్: తరుణ్ భాస్కర్ రివీల్ చేసిన వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 01, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అందుకే తెలుగు హాస్యనటుల జాబితా పెద్దగా ఉంటుంది. తెలుగు తెర మీద ఎంత మంది హాస్యనటులున్నా ఒక్కరు కనిపించగానే అనుకోకుండానే అందరూ నవ్వేస్తుంటారు. ఆ ఒక్కరే బ్రహ్మానందం.

    కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా హాస్యానికి కిరీటంలా నిలిచాడు బ్రహ్మానందం. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ మధ్య సినిమాల్లో బ్రహ్మానందం తక్కువగా కనిపిస్తున్నారు. కానీ మీమ్స్ లో మాత్రం రోజూ దర్శనమిస్తూనే ఉన్నారు.

    కళాకారులంతే, వారి కళ ఎల్లప్పుడూ అవతలి వారిని ఆనందింపజేస్తూ ఉంటుంది. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అలాగే బ్రహ్మానందం తర్వాతి సినిమాల నుండి అప్డేట్లు కూడా వచ్చాయి.

    బ్రహ్మానందం

    పెళ్ళిచూపులు దర్శకుడి సినిమాలో తాత పాత్రలో బ్రహ్మానందం

    బ్రహ్మానందం తర్వాతి సినిమాల అప్డేట్లలో ఎక్కువగా ఆకర్షించింది వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్.పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, తన నెక్స్ట్ మూవీలో బ్రహ్మానందం పాత్రను రివీల్ చేసారు.

    కీడాకోలా అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సాధారణంగా ఇళ్ళల్లో కనిపించే తాత పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తాడని తెలియజేసాడు.

    వీల్ ఛెయిర్ కు అతుక్కుపోయి వచ్చిపోయేవాళ్ళని వెటకారంతో మాట్లాడకుండా చేసి నవ్వులు పూయించే తాత పాత్రలో బ్రహ్మానందం కొత్తగా కనిపిస్తారని, ప్రేక్షకులకు మంచి హాస్యం అందుతుందని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

    అలాగే క్రిష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు బ్రహ్మానందం. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్ ఆపరేషన్‌ సిందూర్‌
    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్ పాకిస్థాన్
    No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం హైదరాబాద్
    Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్  స్పందన బాలీవుడ్

    తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    హృతిక్ రోషన్ పై కామెంట్లకు 14ఏళ్ళ తర్వాత రాజమౌళి వివరణ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    అమెరికాలో వీరసింహారెడ్డిని దాటేసిన వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్య
    ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025