Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి
టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న జయదేవ్‌కు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటి మృతి చెందిన వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జయదేవ్ 2022లో 'కోరంగి నుంచి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. దీన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి) నిర్మించింది. 'సురభి', 'జనని', 'ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు-ది మ్యాన్ హూ నోస్ ది ఫ్యూచర్' వంటి శీర్షికలతో సహా అనేక డాక్యుమెంటరీలను రూపొందించారు. జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కె.ఎన్.టి. శాస్త్రి చిన్న కొడుకే కె.జయదేవ్.