
Pushpa2: పుష్ప-2 ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
యూసుఫ్‌గూడలోని మొదటి పటాలం ప్రాంగణంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ వేడుకకు ప్రజల భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆదివారం రోజున అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్, పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, శ్రేయాస్ మీడియా నిర్వాహకుడు శ్రీనివాస్ వేడుక ప్రదేశాన్ని పరిశీలించారు.
Detials
300 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు
సుమారు 8,000 మందికి పాస్‌లు జారీ చేయడంతో, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు.
వేడుక సమీపంలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థిరంగా కొనసాగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వివరించారు.
'పుష్ప 2' చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ప్రేక్షకులు, అభిమానులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భారీగా హాజరయ్యే అవకాశముంది.