Loading...
Sunil Anand: బాలీవుడ్‌లో విషాదం.. దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం.. దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

Sunil Anand: బాలీవుడ్‌లో విషాదం.. దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దిగ్గజ నటుడు స్వర్గీయ దేవ్ ఆనంద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు సునీల్ ఆనంద్ (70) బ్రిటన్‌లో కన్నుమూశారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఆయన లండన్‌లో ఆగారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన సునీల్ ఆనంద్‌కు స్టెంట్ వేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, శస్త్రచికిత్సకు సిద్ధం చేస్తున్న సమయంలోనే ఆయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విచారకరమైన విషయం ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం ఆయన తండ్రి దేవ్ ఆనంద్ కూడా ఇదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

వివరాలు

1984లో నటుడిగా అరంగేట్రం

దేవ్ ఆనంద్ స్వీయ దర్శకత్వంలో 1984లో వచ్చిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో సునీల్ ఆనంద్ నటుడిగా అరంగేట్రం చేశారు.

ఆ తర్వాత 'కార్ తీఫ్', 'మై తేరే లియే', 'మాస్టర్' వంటి చిత్రాల్లో నటించారు. అయితే, తన తండ్రి తరహాలో ఆయన బాలీవుడ్‌లో సుదీర్ఘకాలం రాణించలేకపోయారు.

అనంతరం నటనకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు.

భారతీయ సినిమాకు దేవ్ ఆనంద్ అందించిన విశిష్ట సేవలకు గానూ ఆయనను పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలు వరించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT