తదుపరి వార్తా కథనం
Jaya Prada : సినీ నటి జయప్రద కుటుంబంలో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 28, 2025
11:07 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆమె సోదరుడు రాజబాబు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను జయప్రద స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
తన అన్నయ్య రాజబాబు మృతిచెందారని తెలియజేయడం చాలా బాధగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాయని జయప్రద తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ వార్త తెలియగానే సినీ ప్రముఖులు, నెటిజన్లు జయప్రద కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
రాజబాబు ఆత్మకు శాంతి చేకూరాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు.