Loading...
Vatsala Rajagopal: సినీ పరిశ్రమలో విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత

Vatsala Rajagopal: సినీ పరిశ్రమలో విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, 'అదుర్స్' ఫేమ్ వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. 93 ఏళ్ల వయసులో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహాన్ని చెన్నైలోని పల్లవరంలో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ 'రోజా' సినిమాతో వత్సల రాజగోపాల్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్ మధుకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు సంపాదించారు. తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.

వివరాలు

70 ఏళ్ల నటనా ప్రస్థానం..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'అదుర్స్‌'లో బామ్మ పాత్రలో నటించారు.

ఈ సినిమాలో ఆమె అభినయం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో 'అదుర్స్ బామ్మ'గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వత్సల రాజగోపాల్ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు.

చిన్నతనం నుంచే ఆమెకు నృత్యం, నాటకాలపై ఎంతో ఆసక్తి ఉండేది. వివాహం అనంతరం 1953లో చెన్నైకి వచ్చారు.

తొలుత ఓ ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే రంగస్థల నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

వివరాలు

పలువురు ప్రముఖుల సంతాపం

రంగస్థలంపై ఆమె నటనను గమనించిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. ఆమెకు సినిమాల్లో అవకాశం కల్పించారు.

అలా 60 ఏళ్ల వయసులో 'రోజా' చిత్రంతో వత్సల రాజగోపాల్ సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి సుమారు 70 ఏళ్ల పాటు తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు.

ADVERTISEMENT