Loading...
Shaji Kumar Cinematographer: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

Shaji Kumar Cinematographer: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలడంతో మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణవార్తతో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

వివరాలు

50కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా..

సినిమాటోగ్రాఫర్‌గా షాజీ కుమార్ మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ముఖ్యంగా మాస్ కమర్షియల్ సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలు, దర్శకులతో కలిసి పనిచేశారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో 50కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే దృశ్యాలను అందించారు.

వివరాలు

'పులిమురుగన్' సహా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు..

షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన చిత్రాల్లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి.

మోహన్‌లాల్ నటించిన 'పులిమురుగన్', 'నరన్', 'ఒడియన్', మమ్ముట్టి నటించిన 'మధురరాజా' వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తొడరుమ్' సినిమాకు కూడా ఆయన పనిచేశారు.

కథకు అనుగుణంగా తెరపై భావోద్వేగాలను, యాక్షన్ సన్నివేశాలను ఆకట్టుకునేలా చూపించడంలో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

సినీ ప్రముఖుల సంతాపం

కెమెరా వెనుక ఉండి సినిమాకు ప్రాణం పోసే సినిమాటోగ్రాఫర్‌గా షాజీ కుమార్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారు.

ఆయన మరణవార్త తెలిసిన పలువురు మలయాళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు.

చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తున్నారు. మొత్తంగా 50కి పైగా చిత్రాలకు పనిచేసి మలయాళ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన షాజీ కుమార్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.

ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ADVERTISEMENT