Loading...
Yash: నా కంఫర్ట్‌ జోన్‌ దాటి చేసిన సినిమా.. 'టాక్సిక్‌' ట్రైలర్‌ వేడుకలో యశ్

Yash: నా కంఫర్ట్‌ జోన్‌ దాటి చేసిన సినిమా.. 'టాక్సిక్‌' ట్రైలర్‌ వేడుకలో యశ్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

''శాంతి వల్ల అంతా బాగుంటే.. శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవి?'' అంటూ హీరో యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌'. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కియారా అడ్వాణీ కథానాయికగా నటించగా.. నయనతార, రుక్మిణీ వసంత్‌, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో హీరో శివ రాజ్‌కుమార్‌ 'టాక్సిక్‌' ట్రైలర్‌ను విడుదల చేశారు.

వివరాలు

నుదిటిపై రాసిన విషాదాన్ని దాచలేం..

''ముసుగేసుకుని మొహం మీదున్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు. నుదిటిపై రాసిన విషాదాన్ని దాచలేం'' అంటూ కియారా అడ్వాణీ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.

ఆ తర్వాత యశ్‌ మాస్‌ యాక్షన్‌, పవర్‌ఫుల్‌ ఎలివేషన్లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

దాదాపు నాలుగున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో 'టాక్సిక్‌' ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను, వాటి మధ్య నెలకొన్న సంఘర్షణను దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ఆసక్తికరంగా పరిచయం చేశారు.

సినిమాలో యశ్‌ రాయా, రూమి అనే రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

తండ్రీకొడుకులుగా కనిపించే ఈ ఇద్దరూ బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? వారి మధ్య జరిగిన పోరులో విజయం ఎవరిని వరించింది? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.

వివరాలు

యాక్షన్‌, మాస్‌ ఎలివేషన్లు ప్రత్యేక ఆకర్షణ..

ట్రైలర్‌లో యశ్‌ వైల్డ్‌ యాక్షన్‌, మాస్‌ ఎలివేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా యంగ్‌ లుక్‌లో యశ్‌ సృష్టించిన విధ్వంసం ఆకట్టుకుంది.

సినిమాలో హింస, రక్తపాతం ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ట్రైలర్‌ ద్వారా చూపించారు.

''అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం'', ''ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి'' వంటి డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి.

ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో యశ్‌ మాట్లాడుతూ.. ''ఇది నా సినిమా కాదు.. ఇది ఇండియన్‌ సినిమా.

ఇండియన్‌ సినిమాను గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం.

నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది'' అని అన్నారు.

ADVERTISEMENT