NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌
    తదుపరి వార్తా కథనం
    Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌
    త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

    Trisha : త్రిషపై మన్సూర్ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ సీరియస్‌

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 20, 2023
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ దక్షిణాది నటి త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.

    ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ, మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలిచ్చింది.

    ఆయన వ్యాఖ్యలు పట్ల బాధపడుతున్నట్లు చెప్పిన మహిళా కమిషన్, మహిళల గురించి అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించబోమని అల్టిమేటం జారీ చేసింది.

    ఈ క్రమంలోనే త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్ తరఫున ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.

    నిందితుడిపై IPC సెక్షన్ 509 B (ఎలక్ట్రానిక్‌ మీడియాలో లైంగిక ఆరోపణలు)తో ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదుకు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

    details

    మన్సూర్ అలీఖాన్ ఏమన్నాడంటే ..

    మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్న ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని మహిళా కమిషన్ తేల్చి చెప్పింది.

    అసలేం జరిగిందంటే :

    ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్‌ అలీఖాన్‌, 'లియో'లో త్రిషతో ఓ సీన్‌'కు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

    గతంలో తాను ఎన్నో చిత్రాల్లో రేప్‌ సీన్లలో నటించానని, 'లియో'లోనూ అలాంటి సీన్‌ ఉంటుందని భావించానన్నారు.

    రేప్ సీన్‌ లేకపోవడం బాధగా అనిపించిందని మన్సూర్‌ అన్నారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన త్రిష, తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

    ఇటువంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందని, అతడితో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోకపోవడం ఆనందంగా ఉందన్నారు.

    ఇదే సమయంలో మన్సూర్ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మంచిది కాదని హితవు పలుకుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోలీవుడ్

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    కోలీవుడ్

    తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు  తళపతి విజయ్
    Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్  సినిమా
    రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2  రజనీకాంత్
    లియో: 100 మిలియన్ల మార్కును చేరుకున్న నా రెడీ సాంగ్; విజయ్ ఖాతాలో నాలుగవ పాట  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025